తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్వే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు..

Secunderabad Agnipath case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో చంచల్​గూడ జైలులో రిమాండ్​లో ఉన్న 45మంది నిందితులను రైల్వే పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈరోజు, రేపు వారిని ఘటనకు సంబంధించిన పలు అంశాలపై వారిని ప్రశ్నించనున్నారు.

సికింద్రాబాద్ అల్లర్ల కేసు
సికింద్రాబాద్ అల్లర్ల కేసు

By

Published : Jul 2, 2022, 4:23 PM IST

Secunderabad Agnipath case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో చంచల్​గూడ జైలులో రిమాండ్​లో ఉన్న 45మంది నిందితులను రైల్వే పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈరోజు, రేపు వారిని పలుకోణాల్లో ప్రశ్నించనున్నారు. ఘటనకు సంబంధించిన పలు అంశాలపై వారి నుంచి సమాచారం రాబట్టనున్నారు. రేపు సాయంత్రం 5గంటల వరకు పోలీసుల విచారణ కొనసాగనుంది. తిరిగి వారిని వైద్యపరీక్షల అనంతరం రైల్వే మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి చంచల్​ గూడ జైలుకు తరలించనున్నారు.

అసలేం జరిగిందంటే..కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కనీవినీ ఎరగని రీతిలో విధ్వంసం చెలరేగింది. ఒక్కసారిగా దూసుకువచ్చిన వేలమంది ఆర్మీ ఆశావహులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. 8 రైళ్లకు చెందిన బోగీలను తగులబెట్టారు. షాపులను లూటీ చేశారు. ఆర్టీసీ బస్సులపైనా దాడిచేశారు. పక్కా పథకం ప్రకారం జరిగిన ఆ దమనకాండను ఆపేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. పలువురికి బుల్లెట్లు తాకి గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details