పూజల పట్ల ఏ మాత్రం సంతోషంగా లేనని రంగం కార్యక్రమంలో భాగంగా భవిష్యవాణిలో అమ్మవారు చెప్పారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వివరించారు.
రాబోయే రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలి... రంగంలో స్వర్ణలత - సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
'నేను చూస్తున్నాను... నేను చూసుకుంటాను'
రాష్ట్రంలో కరోనా ప్రభావం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... భక్తులు అమ్మవారిని దర్శించుకునే భాగ్యం లేకపోయిందని విన్నవించుకోగా... మానవులు చేసుకున్న దానికి అనుభవించాల్సిన ప్రతిఫలం అని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజల కష్టాలు త్వరలోనే తీరుతాయని... గంగాదేవికి యజ్ఞహోమాలు నిర్వహిస్తే సిరిసంపదలు కలుగుతాయని భవిష్యవాణిలో వివరించారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు