రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఆయా స్థానాల్లో ఓటరు జాబితాల తయారీకి ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 4న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించి 8 వరకు ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరించాలని తెలిపింది.
అభ్యంతరాలను పరిష్కరించి ఏప్రిల్ 12న ఓటర్ల తుదిజాబితా ప్రచురించాలని ఆదేశించింది. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో అన్ని ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్ మండల జడ్పీటీసీ స్థానం, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 34 ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.