ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఆపేందుకు చివరి నిమిషం వరకు కొందరు ప్రయత్నించారని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలతో జిల్లాలో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. గ్రామాల్లో రాజకీయ చైతన్యం ఉందని.. ఎన్నికల్లో పోటీ ఉన్నా అందరూ కలిసిమెలిసి ఉంటారన్నారు.
'ఎన్నికలు ఆపేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు'
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోందని ఆ రాష్ట్ర ఈసీ రమేశ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికలు ఆపేందుకు కొందరు చివరి నిమిషం వరకు ప్రయత్నించారని ఆక్షేపించారు. గ్రామాల్లో రాజకీయ చైతన్యం ఉందని.. ఎన్నికల్లో పోటీ ఉన్నా అందరూ కలిసిమెలిసి ఉంటారన్నారు.
'ఎన్నికలు ఆపేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు'
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోందని ఎస్ఈసీ వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ నడుచుకుంటుందని.. రాజ్యాంగం ప్రకారం పంచాయతీలకు నిధులు వస్తున్నాయన్నారు.
ఇదీ చూడండి:తెలంగాణ వార్షిక బడ్జెట్లో నిరుద్యోగ భృతి అంశం..!