పురపాలక ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఒకే కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బంది ఉండరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పురపోరు కోసం పోలింగ్ సిబ్బంది నియామకానికి సంబంధించి ఎస్ఈసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహిస్తున్నందున ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు నలుగురు పోలింగ్ అధికారులను నియమించాల్సి ఉంటుంది. 20శాతం అదనపు సిబ్బంది ఉండేలా చూడాలి. సంబంధిత మున్సిపాల్టీకి సంబంధం లేని ఉద్యోగులను మాత్రమే పోలింగ్ సిబ్బందిగా నియమించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
'పుర'పోరుకు ఎస్ఈసీ మార్గదర్శకాలు - రాష్ట్ర ఎన్నికల సంఘం
పురపోరు కోసం పోలింగ్ సిబ్బంది నియామకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్రాల్లో ఒకే కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బంది ఉండరాదని ఎస్ఈసీ తెలిపింది. మహిళా ఓటర్లను గుర్తించేందుకు కనీసం ఒక మహిళా అధికారిని సిబ్బందిగా నియమించాలని పేర్కొంది.
పోలింగ్ సిబ్బంది నియమకాలపై ఎస్ఈసీ మార్గదర్శకాలు
మహిళా ఓటర్లను గుర్తించేందుకు వీలుగా ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ విధిగా కనీసం ఒక మహిళా అధికారిని సిబ్బందిగా నియమించాలి. మూడు దశల్లో రాండమైజేషన్ చేసి పోలింగ్ సిబ్బందిని ఆ పోలింగ్ కేంద్రాలకు కేటాయించాల్సి ఉంటుంది. సిబ్బంది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక అవసరమైన శిక్షణ ఇవ్వాలని ఎస్ఈసీ తెలిపింది.
ఇవీ చూడండి: చనిపోయి కూడా తొమ్మిది మందికి జీవితాన్నిచ్చింది..