తెలంగాణ

telangana

కార్పొరేషన్​లు, మున్సిపాలిటీల ఎన్నికలకు ఎస్​ఈసీ కసరత్తు

By

Published : Apr 3, 2021, 8:03 PM IST

గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా పలు మున్సిపాలిటీల ఎన్నికలకు ఎస్‌ఈసీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు పురపాలకశాఖ షెడ్యూల్ ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం

గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్​, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు పురపాలకశాఖ షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే తయారు చేసిన వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఆధారంగా 12 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.

ఇవాళ్టి నుంచి ఏడో తేదీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. సర్వే ఆధారంగా 8న వివరాల ముసాయిదా ప్రకటిస్తారు. ఈ ముసాయిదాపై 11వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. 13వ తేదీలోగా వాటిని పరిష్కరించి.. 14న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలతో వార్డుల వారీ ఓటరు జాబితాలు ప్రకటించాలని పురపాలక శాఖ తెలిపింది. ఆ తర్వాత వార్డుల వారీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది.

ఇదీ చూడండి:'స్థానిక పోరు': పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు నోటిఫికేషన్ జారీ

ABOUT THE AUTHOR

...view details