తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసం అధికారుల నియామకం - హైదరాబాద్​ వార్తలు

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను నియమించింది. 150 డివిజన్లకు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకాలను ప్రకటించింది.

sec appointed election officers for ghmc elections
జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసం అధికారుల నియామకం

By

Published : Oct 29, 2020, 5:06 AM IST

వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం రిటర్నింగ్, సహాయక రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. మొత్తం 150 డివిజన్లకు గాను.. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకాలను ప్రకటించగా.. మరో 61 మంది రిటర్నింగ్, 71 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను రిజర్వ్​లో ఉంచనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 30 సర్కిళ్లలో ఎన్నికల అధికారుల నియామకాలు పూర్తవగా.. ఇక గ్రేటర్ పోరుకు షెడ్యూల్ త్వరలో వెలువడనుంది.

ఇవీ చూడండి: దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పోలీస్​ పరిశీలకుడుగా సరోజ్​ ఠాకూర్​

ABOUT THE AUTHOR

...view details