వేసవిలో ఐస్‌క్రీం ప్రియుల కోసం స్కూప్స్ ఐస్‌క్రీం సెంటర్ సరికొత్త రుచులను అందుబాటులోకి తెచ్చింది. జూబ్లీహిల్స్‌లోని స్కూప్స్ దుకాణంలో వర్ధమాన సినీనటి సంజన కొత్త రుచులను ప్రారంభించారు. సమ్మర్ ఐస్‌క్రీం, మెగాస్టార్ చాకోస్, అల్ఫొన్సాకింగ్ అనే మూడు కొత్తరుచులను తీసుకొచ్చారు. వెజిటేరియన్, షుగర్ ఫ్రీ, ఫ్యాట్ ఫ్రీ, ఐస్‌క్రీంతో పాటు సీజన్‌కు తగ్గట్టుగా రుచులు అందిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం ఆ కొత్తరుచులను మీరూ ఓ పట్టుపట్టండి.
హిమక్రీమ్.. కొత్త రుచులతో మరింత మధురం
వేసవిలో ఎండ ఎంత చిరాకుపెట్టినా ఐస్‌క్రీం రుచి గుర్తుకు రాగానే నాలుక నాట్యమాడుతుంది. సాయం సంధ్యవేళ అల..అల..మెల్లగా నడుస్తూ చల్లని ఐస్‌క్రీం తింటుంటే.. ఆ తలపే నోరూరుతోందికదూ... కాలంతో పనిలేకుండా ఐస్‌క్రీం పార్లర్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇక ఈ వేసవి మార్కెట్లోకి సరికొత్త రుచులను అందుబాటులోకి తెచ్చింది స్కూప్స్ ఐస్‌క్రీం.. వాటి రుచేంటో ఓలుక్కేద్దాం..
scoops-ice-cream-new-