TS Schools New Timings: రాష్ట్రంలో గురువారం నుంచి పాఠశాలలను యథావిధిగా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఆరో తేదీ వరకు పాఠశాలల పని వేళల్లో గంట తగ్గించి ఉదయం 11.30 గంటల వరకూ నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ పాత పనివేళలనే కొనసాగించనున్నారు.
TS Schools New Timings: నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలకు పాత వేళలే.. - ts news
TS Schools New Timings: నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలకు పాత వేళలే కొనసాగించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు యథావిధిగా బడుల్లో పనివేళలు కొనసాగనున్నాయి. గతంలో తీవ్రమైన ఎండల కారణంగా గతంలో బడుల పనివేళల్లో గంట తగ్గించారు.
TS Schools New Timings: నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలకు పాత వేళలే..
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు ఈ మేరకు పాఠశాలలు నిర్వహించాలని పేర్కొన్నారు. పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు నిర్వహించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: గ్రూప్స్ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూలు రద్దు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం?