Schools, Colleges Reopen: రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలను తెరిచి ప్రత్యక్ష తరగతులను నిర్వహించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కరోనా పరిస్థితుల కారణంగా ఈ నెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగించి విద్యాసంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా సీరియస్ కేసులు లేకపోవడం, త్వరలోనే తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంతర్గతంగా అంచనాకు వస్తుండటంతో మళ్లీ ప్రత్యక్ష తరగతులను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీలుంటే ఈ నెల 31వ తేదీ నుంచి, లేకుంటే మరో వారంపాటు సెలవులు పొడిగించి ఫిబ్రవరి రెండో వారం నుంచి తరగతులు ప్రారంభింపజేయాలని భావిస్తున్నారు. అయితే ప్రత్యక్ష తరగతులకు రావాలా? ఆన్‌లైన్ ఎంచుకోవాలా? అనేది తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
విద్యా సంస్థలను తెరిచే యోచనలో ప్రభుత్వం.. 31 నుంచి ప్రత్యక్ష తరగతులు? - schools reopen news
Schools, Colleges Reopen: రాష్ట్రంలో విద్యా సంస్థలను తెరిచి ప్రత్యక్ష తరగతులను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కరోనా కారణంగా సీరియస్ కేసులు లేకపోవడం, త్వరలోనే తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంతర్గతంగా అంచనాకు వస్తుండటంతో మళ్లీ ప్రత్యక్ష తరగతులను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
విద్యా సంస్థలను తెరిచే యోచనలో ప్రభుత్వం.. 31 నుంచి ప్రత్యక్ష తరగతులు?