బుధవారం నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పిల్లలందరూ కొత్త బట్టలు, కొత్త బ్యాగులు, కొత్త పుస్తకాలతో స్కూల్బస్సుల్లో పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. కానీ... పాఠశాల బస్సులు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి? గ్రేటర్ పరిధిలో 13వేల 82 పాఠశాల బస్సులు ఉండగా... వీటిలో ఇప్పటివరకు సామర్థ్య పరీక్షలు చేయించుకున్న బస్సులు కేవలం 9వేలు మాత్రమే. ఇంకా 3వేల 500ల పైచిలుకు ఫిట్నెస్ చేయించుకోకుండానే రోడ్లపై తిరుగుతున్నాయి.
ఫిట్నెస్ లేకున్నా... నడుస్తున్నాయి:
హైదరాబాద్ రవాణాశాఖ పరిధిలో మొత్తం 2వేల 341 పాఠశాలల బస్సులు ఉంటే... అందులో ఫిట్నెస్ చేయించుకున్న బస్లు కేవలం 1,137 మాత్రమే. మిగిలిన 1,204 పాఠశాలల బస్సులు ఫిట్ చేయించుకోకుండానే పిల్లలను తరలిస్తున్నాయి. సెంట్రల్ రవాణాశాఖ కార్యాలయం పరిధిలో 710, తూర్పు రవాణాశాఖ కార్యాలయం పరిధిలో 145, పశ్చిమ రవాణాశాఖ పరిధిలో 70, ఉత్తరం రవాణాశాఖ పరిధిలో 97, దక్షిణ రవాణశాఖ పరిధిలో 182 పాఠశాలల బస్సులు ఇప్పటికీ సామర్థ్య పరీక్షలు చేయించుకోనేలేదు.
మేడ్చల్ జిల్లాలో 4వేల 800ల పాఠశాల బస్సులుండగా... 3వేల 700లు మాత్రమే ఫిట్నెస్ చేయించుకున్నాయి. ఇంకా.. 1100 ఆర్టీఏ కార్యాలయం వైపే రాలేదు.
రంగారెడ్డి జిల్లాలో 5వేల పాఠశాల బస్సులుండగా... 1100 బస్లు ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంది.