తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR on Double Bedroom Houses : 'ఆగస్టు మొదటివారం నుంచి రెండుపడక గదుల ఇళ్ల పంపిణీ' - రెండుపడక గదుల ఇళ్ల పంపిణీ

KTR Review on Double Bedroom Houses : జీహెచ్‌ఎంసీలో రెండుపడక గదుల ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిర్మాణం పూర్తయిన ఇళ్లను 6 దశల్లో పంపిణీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు మొదటి మొదటివారం నుంచి అక్టోబర్ మూడోవారం వరకు డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల పంపిణీ జరుగుతుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దాదాపు 70 వేల ఇళ్లను పేదలకు అందించనున్నట్లు పేర్కొన్నారు.

Double Bedroom Houses
Double Bedroom Houses

By

Published : Jul 19, 2023, 10:38 PM IST

Double Bedroom Houses in Telangana : రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్​ రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందులో అత్యధిక భాగం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి వెల్లడించారు. మిగిలిన చోట్ల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయన్నారు.

Minister KTR on Double Bedroom Houses in GHMC : మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి సంబంధించి జీహెచ్​ఎంసీ ఒక షెడ్యూల్ విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమానికి సంబంధించిన అంశంలో రెవెన్యూ యంత్రాంగం నుంచి మద్దతు తీసుకొని జీహెచ్​ఎంసీ ముందుకెళ్తోంది. రెండుపడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

KTR Review on Double Bedroom Houses : జీహెచ్ఎంసీలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్​ని అధికారులు సిద్ధం చేశారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందేలా చూడాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 4 వేలపైగా ఇళ్లను పేదలకు అందించామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఆగస్టు మొదటివారం నుంచి రెండుపడక గదుల ఇళ్ల పంపిణీ : జీహెచ్ఎంసీ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటివారం నుంచి రెండుపడక గదుల ఇళ్ల పంపిణీ మొదలవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. అక్టోబర్ మూడవ వారం వరకు ఈ పంపిణీ కొనసాగుతుందన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను 6 దశల్లో పంపిణీ చేస్తామన్న ఆయన... దాదాపు 70 వేల ఇళ్లను పేదలకు అందించనున్నట్లు తెలిపారు. వీటికి అదనంగా నిర్మాణం తుదిదశలో ఉన్న ఇళ్లను పంపిణీ జాబితాలో చేర్చాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

మరోవైపు గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌.. సొంత స్థలంలో ఇళ్ల నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఇటీవల గృహలక్ష్మి పేరుతో ఆ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఇటీవలే మంత్రిమండలి ఆమోదం తెలపగా.. జీవో సైతం విడుదలైంది. ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details