SC Slams Telangana Police for Using Detention Act : దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటుంటే తెలంగాణ పోలీసులు మాత్రం ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరిస్తున్నారని సుప్రీం కోర్టు మండిపడింది. ముందస్తు నిర్బంధ చట్టాన్ని అనుకున్న వెంటనే అమలు చేస్తూ.. వెంటనే అరెస్టులు చేస్తున్న తెలంగాణ పోలీసుల తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్బంధంలో ఉన్న మహిళ భర్తను ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడానికి తెలంగాణ పోలీసులు జారీ చేసిన ఆదేశాలను కొట్టివేస్తూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది.
Mohammad Akbar Lone Centre : అసెంబ్లీలో పాక్కు జైకొట్టిన ఎమ్మెల్యే.. సుప్రీంకోర్టులో ఊహించని షాక్
Supreme Court Fires on Telangana Police :చట్టంలోని కఠిన నిబంధనలను ఎలా పడితే అలా అమలు చేయకూడదనే విషయాన్ని తెలంగాణ పోలీసులకు గుర్తు చేస్తున్నాం అని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవైపు దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటుంటే.. అదే సమయంలో మరోవైపు నేరాలను నియంత్రించడానికి విధులను నిర్వహిస్తున్నామని ప్రకటించుకుంటున్న ఈ రాష్ట్ర పోలీసులకు పౌరుల హక్కులను రక్షించాలనే బాధ్యత ఉందన్న విషయం గుర్తు ఉండాలి కదా అని ప్రశ్నించింది. కానీ రాజ్యాంగం పౌరులకు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను మరిచిపోయి వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు పోలీసులు నియంత్రిస్తున్నారని మండిపడింది. ఇలాంటి చర్యలకు చరమగీతం పాడాలి అని సుప్రీం ధర్మాసనంఅభిప్రాయపడింది.
ప్రాథమిక హక్కలను గుర్తు చేసిన సుప్రీం :'ముందస్తు నిర్బంధం అనేది అసాధారణ పరిస్థితుల్లో తీసుకునే చర్య అని రాజ్యాంగ నిర్మాతలు తెలిపారు. కానీ అలాంటి నిబంధనను అతి సాధారణ కేసుల్లోనూ వర్తింపడజేయడం కొన్నేళ్లుగా జరుగుతోంది. ముందస్తు నిర్బంధంలో ప్రజల చేతులకి వేస్తున్న సంకెళ్లను తెంచడానికి రాజ్యంగంలో రక్షణలు ఉన్నాయని గుర్తు చేసింది. ఆర్టికల్ 14.. చట్టం ముందు ఎలాంటి బేధాలు లేకుండా అందరు సమానులేనని చెబుతోంది. ఆర్టికల్ 19.. ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడుతుందని తెలిపింది. ఆర్టికల్ 21.. దీవించే హక్కు ఇది వ్యక్తిగత స్వేచ్ఛ కల్పిస్తుంది' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.