తెలంగాణ

telangana

By

Published : Feb 27, 2022, 10:17 PM IST

Updated : Feb 27, 2022, 10:25 PM IST

ETV Bharat / state

SBI Mega Property Show: గృహ రుణాల జారీలో మార్కెట్ లీడర్‌గా ఎస్బీఐ

SBI Mega Property Show: గృహ రుణాల జారీలో ఎస్బీఐ మార్కెట్ లీడర్‌గా ఉందని... ఎస్బీఐ ఎండీ శ్రీనివాసులు శెట్టి తెలిపారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఎస్బీఐ మెగా ప్రాపర్డీ షోను... ఆయన ప్రారంభించారు.

SBI
SBI

గృహ రుణాల జారీలో మార్కెట్ లీడర్‌గా ఎస్బీఐ

SBI Mega Property Show: గృహ రుణాల జారీలో ఎస్బీఐ మార్కెట్ లీడర్​గా ఉందని ఎస్బీఐ ఎండీ శ్రీనివాస శెట్టి అన్నారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే గృహ రుణాలపై ఎస్బీఐ తక్కువ వడ్డీ వర్తిస్తుందన్నారు. యోనో యాప్ ద్వారా ఆన్లైన్ లో లోన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. హైటెక్స్​లో ఎస్బీఐ ఆధ్వర్యంలో మెగా ప్రాపర్డీ షో శనివారం ప్రారంభమయింది. పీఎం ఆవాసయోజన పథకానికి ఎస్బీఐ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ బిల్డర్లు, నిర్మాణ రంగ సంస్థలు ఈ మెగా ప్రాపర్డీ షో పాలుపంచుకున్నాయి. ఈ ప్రాపర్టీ షోలో లోన్ జారీపై తక్కువ ప్రాసెసింగ్‌ ఫీజు వసూలుతో పాటు ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను పెట్టారు.

నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని 55 ప్రాజెక్టులు ప్రాపర్టీ షోలో తమ స్టాల్లను ఏర్పాటు చేశాయి. ఎస్బీఐకి 30 లక్షల గృహ రుణాలు తీసుకున్న కస్టమర్స్ ఉన్నారని ఎస్బీఐ ఎండీ శ్రీనివాస శెట్టి అన్నారు. బెంగుళూరు, ముంబయితో పోటీ పడి హైదరాబాద్ హోమ్ లోన్ మార్కెట్ ముందుకెళ్తుందన్నారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐలో గృహ బుణం వడ్డీ రేట్ తక్కువగా ఉందన్నారు. సిబిల్ స్కోర్​ను బట్టి వడ్డి రేటు ఉంటుందని తెలిపారు. కస్టమర్లను, డెవలపర్స్​ను ఒకే తాటిపైకి తీసుకురాడానికి ఈ ప్రాపర్టీ షో ఏర్పాటు చేశామన్నారు. ఎస్బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో కొవిడ్‌ కష్టకాలంలోనూ 10 వేల కోట్ల మేర గృహ రుణాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆటోడ్రైవర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా..: రేవంత్

Last Updated : Feb 27, 2022, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details