SBI Bank Manager Cheating Case in Hyderabad: ఓ బ్యాంక్ మేనేజర్ తన అధికారాన్ని ఉపయోగించుకుని మోసానికి పాల్పడ్డాడు. సుమారు అనధికారకంగా రూ.4.75 కోట్లు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించి, వెంటనే ఆ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ కార్తీక్‌రాయ్2020 జూన్ 20 నుంచి 2023 జూన్ 16 వరకు పని చేశారు. ఆ సమయంలో బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నావారికి లోన్ రద్దు చేస్తామని చెప్పాడు. దీంతో కొందరికీ మళ్లీ రుణాలు మంజూరు చేశాడు. అయితే ముందు తీసుకున్న అప్పు రద్దు చేయకపోగా ఖాాతాదారులకు తెలియకుండా మంజూరు చేసిన లోన్లు థర్డ్ పార్టీ ఖాతాకు నిధులు మళ్లించాడు.
డబ్బుకోసం ఏకంగా బ్యాంకుకే కన్నం వేసిన దొంగ - అలారం మోగడంతో విఫలం
Bank Manager Cheating Customers in Sanath Nagar: కొన్ని రోజులకు లోన్ పేరిట బ్యాంక్ మేనేజర్ చేసిన మోసాన్ని గ్రహించి బాధితులు కార్తీక్రాయ్ను నిలదీశారు. వారికి సాంకేతిక కారణాల వలన అలా జరిగిందని సాకు చెప్పాడు. రుణాలకు సంబంధించి ఈఎంఐలు చెల్లిస్తానని వారికి హామీ ఇచ్చాడు. ఇక లోన్ ఖాతాల మూసివేత కోసం రుణ గ్రహీతలు ఇచ్చిన డిమాండ్ డ్రాఫ్ట్‌లను థర్డ్ పార్టీ ఖాతాలకు మళ్లించాడు. బ్యాంకులోని పలు డిపాజిట్లకు వ్యతిరేకంగా ఓడీ ఖాతాలను తెరిచి డిపాజిట్ల మొత్తాన్ని అందులోకి మళ్లించాడు. మరణించిన ఖాతాదారులకు సంబంధించిన నిధులను కూడా ఆ థర్డ్ పార్టీ ఖాతాల(Bank Manager Cheating)కు బదిలీ చేశాడు.