'నీటి సంరక్షణ కోసం ప్రజలు, ప్రభుత్వాలు ముందుకు రావాలి' - సొసైటీ ఫర్ అవేర్నెస్
హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో సేవ్ సంస్థ ఆధ్వర్యంలో నెల రోజులపాటు జల సంరక్షణపై జరిగిన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. మాసం రోజుల్లో నీటి సంరక్షణ, నీటి పొదుపు వంటి అంశాలపై సొసైటీ ఫర్ అవేర్నెస్, విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్ వ్యవస్థాపకులు విజయ్ రామ్ అవగాహన కల్పించారు.
యావత్ మానవజాతి మనుగడ నీటిపైనే ఆధారపడి ఉందని సొసైటీ ఫర్ అవేర్నెస్, విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్ వ్యవస్థాపకులు విజయ్‌రామ్ అన్నారు. నెల రోజులుగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో జల సంరక్షణపై జరిగిన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రత్యేకించి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులకు నీటిని ఒడిసిపట్టడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఇప్పటికైనా నీటి ఆవశ్యకతను గుర్తించి నీటి సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని.. దానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని విజయ్ రామ్ కోరారు.