Satyavathi Rathod Responded on Anganwadi Workers Protestin Telangana : తమ డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రంలో 11 రోజులుగా అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది ఆందోళన బాట (Anganwadi Workers Protest ) పట్టిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. అంగన్వాడీల సమస్యలపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు వేసి సమ్మెకు దిగడం సరికాదని అన్నారు. పరిస్థితి అర్థం చేసుకుని సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర సర్కార్ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తుందని సత్యవతి రాఠోడ్ వివరించారు.
Anganwadi Staff Strike in Telangana :అంగన్వాడీల సమస్యలను కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు.. మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దిల్లీకి వెళ్తున్నారని సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాష్ట్రం పరిధిలో లేదన్నారు. పీఆర్సీ ద్వారా అంగన్వాడీల జీతాలు మరింత పెరుగుతాయని.. విధులు బహిష్కరించి సమ్మె చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. శాంతియుతంగా వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తే బాగుంటుందని సత్యవతి రాఠోడ్ ( Minister Satyavathi Rathod) సూచించారు.
Mid Day Meals Workers on Strike : సర్కారీ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నభోజనం బంద్.. ఎక్కడో తెలుసా?
Anganwadi Workers Protest in Telangana: రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను.. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశామని సత్యవతి రాఠోడ్ గుర్తు చేశారు. అందులో పని చేసే సిబ్బంది పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచామని అన్నారు. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష.. మినీ అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50,000 ప్రత్యేక ఆర్థికసాయం అందిస్తున్నట్లు చెప్పారు. పీఆర్సీ కూడా వర్తింపజేసి అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.10,500 నుంచి రూ.13,650కు.. మినీ అంగన్వాడీటీచర్ల వేతనం రూ.6,000 నుంచి రూ.7,800లకు పెంచిన ఘనత కేసీఆర్ సర్కార్దని వివరించారు. రూ.13,650లో.. కేంద్ర వాటా కేవలం రూ.4200 మాత్రమేనని.. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందనే విషయం ఉద్యోగులు గమనించాలని సత్యవతి రాఠోడ్ సూచించారు.