తెలంగాణ

telangana

ETV Bharat / state

'పర్యటక కేంద్రంగా సర్వాయి పాపన్న కోట'​ - సర్వాయి పాపన్న

హైదరాబాద్​లో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాపన్న చేసిన సేవలు చిరస్మరణీయమని.. ఆయన కోటను పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు.

సర్వాయి పాపన్న కోట..పర్యటక కేంద్రంగా: శ్రీనివాస్​ గౌడ్​

By

Published : Aug 19, 2019, 5:42 PM IST

హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పేద బడుగు బలహీన వర్గాల కోసం నాడు సర్వాయి సర్ధార్ పాపన్న చేసిన పోరాటం చిరస్మరణీయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చిక్కడపల్లిలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న 369వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సర్వాయి పాపన్న జఫర్గడ్ కోటను నిర్మించి పేద ప్రజలకు అందించిన సేవలను శ్రీనివాస్​ గౌడ్​ కొనియాడారు. జఫర్గడ్​ కోటను పరిరక్షించడంతో పాటుగా పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

పర్యటక కేంద్రంగాసర్వాయి పాపన్న కోట: శ్రీనివాస్​ గౌడ్​

ABOUT THE AUTHOR

...view details