ఉమ్మడి చెక్‌పవర్ వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని పంచాయతీ సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడు భూమన్న యాదవ్ తెలిపారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నూతన సర్పంచ్‌లతో ఆయన ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పటికే సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య ఆధిపత్య పోరు నెలకొందన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో పరిపాలన ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఏకగ్రీవమైన సర్పంచులకు ప్రకటించిన నజరానా వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరవేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఉమ్మడి చెక్‌పవర్‌ను రద్దుచేయండి: సర్పంచుల సంఘం - ఉమ్మడి చెక్‌పవర్‌ను రద్దుచేయండి
ఉమ్మడి చెక్ పవర్ ఇవ్వడం వల్ల సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య ఆధిపత్య పోరు ఏర్పడిందని సర్పంచుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణమే ఉమ్మడి చెక్‌పవర్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ. 20 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి చెక్‌పవర్‌ను రద్దుచేయండి: సర్పంచుల సంఘం
ఇవీ చూడండి: 'వ్యవసాయరంగ సమస్యలపై దేశవ్యాప్త నిరసన'