తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే: సరూర్‌నగర్ తహసీల్దార్

"ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే. ధ్రువీకరణ పత్రం కోసం కార్యాలయానికి వచ్చి సిబ్బందిని బెదిరించింది. మీ ఉద్యోగాలు ఊడగొడతానంటూ గొడవకు దిగింది. చివరకు ఇక్కడి నుంచే ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లి చెత్తకుప్పలో దొరికినట్లుగా చిత్రీకరించింది": శ్రీనివాస్ రెడ్డి, సరూర్‌నగర్ తహసీల్దార్

By

Published : May 9, 2019, 7:34 AM IST

Updated : May 9, 2019, 7:46 AM IST

ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే: సరూర్‌నగర్ తహసీల్దార్

ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే: సరూర్‌నగర్ తహసీల్దార్

సరూర్‌నగర్‌ తహసీల్దార్ కార్యాలయంంలో ధ్రువీకరణ పత్రాలు నిర్ణీత సమయంలో రావట్లేదన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సిమ్రాన్ క్రిస్టోఫర్ అనే మహిళ తప్పుడు ఆధారాలతో కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే... దానిని తిరస్కరించినందుకు కార్యాలయంలో అందరితో గొడవకు దిగిందని ఆరోపించారు. ధ్రువీకరణ పత్రం కోసం సిబ్బందిని బెదిరించిందన్నారు. తప్పుడు సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు ఆమెపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. తమ కార్యాలయం వెనుక చెత్తకుప్పలో అసలు ధ్రువపత్రాలు ప్రత్యక్షమైనట్లు సదరు మహిళ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం అబద్ధమని శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

Last Updated : May 9, 2019, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details