ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటి దొంగ దొరికాడు - CP ANJANIKUMAR

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనుకున్నాడో ఏమో పవిత్ర ప్రదేశంలో పనిచేస్తూ దేవతల సొమ్ముకే కన్నమేసాడో కేటుగాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికి కటకటాలపాలయ్యాడు.  ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శంకర్​మఠ్​లో జరిగిన చోరీ కేసులో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

sankarmatt-chory
author img

By

Published : May 19, 2019, 10:46 PM IST

నల్లకుంట ఠాణా పరిధిలోని శంకర్​మఠ్​లో ఈనెల 16న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం చేసింది శంకర్​మఠ్​లో కార్యాలయ సహాయకుడిగా పనిచేస్తున్న రాళ్లబండి నాగ సాయిరామ్​గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది.

అసలు ఏం జరిగింది

శంకర్​మఠ్​ ఆలయ నిర్వాహకులు ఆలయంలోని శారదాంబ విగ్రహాన్ని పసిడి చీరతో అలంకరించాలని నిర్ణయించారు. అందుకోసం దాతల నుంచి విరాళాలు సేకరించారు. దాతల నుంచి వచ్చిన విరాళాలను ఆలయ నిర్వాహకుడి అల్మారాలో భద్రపరిచారు.

సొత్తుపై కన్నేశాడు

కార్యాలయంలో అన్ని విషయాలు తెలిసిన సహయకుడు సాయిరామ్​కు వక్రబుద్ధి పుట్టింది. అల్మారాలో సొత్తను కాజేయాలని పథకం వేశాడు. రహస్యంగా అల్మారా తాళాలు దొంగిలించి విరాళంగా వచ్చిన సొత్తు ఎత్తుకెళ్లాడు. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపెట్టాడు. నిందితుడి నుంచి 250 గ్రాముల బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.7,50,000 ఉండొచ్చని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ తెలిపారు.

శంకర్​మఠ్​ దొంగను అరెస్ట్​ చేసిన పోలీసులు

ఇదీ చదవండి: కాసేపట్లో పెళ్లి..అంతలో ఆగిపోయింది..

ABOUT THE AUTHOR

...view details