తెలంగాణ

telangana

ETV Bharat / state

సంకల్ప్ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో అన్నప్రసాదం వితరణ

సంకల్ప్ ఫౌండేషన్, మేజ్​బార్‌ రెస్టారెంట్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నిరుపేదలకు, వలస కూలీలకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పరిధిలో సుమారు 1500 మందికి ఆహార ప్యాకెట్ల వితరణ చేశారు.

సంకల్ప్ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో అన్నప్రసాదం వితరణ
సంకల్ప్ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో అన్నప్రసాదం వితరణ

By

Published : May 6, 2020, 12:06 AM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సంకల్ప్ ఫౌండేషన్​తో కలిసి మేజ్​బార్‌ రెస్టారెంట్ నిర్వాహకులు వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలు, రోజూవారి కూలీలకు స్థానిక పోలీసుల సహకారంతో సుమారు 1500 మందికి ఆహార పొట్లాలను అందజేశారు.

మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని సిరోల్‌ గ్రామంలోనూ నిత్యావసర సరుకులతో పాటు శానిటైజర్ కిట్లను ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు శివానంద రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

సంకల్ప్ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో అన్నప్రసాదం వితరణ

ఇవీ చూడండి : క్షౌరశాలలు లేకుంటేనేం.. మీకు నేనున్నానంటున్న మహిళ.!

ABOUT THE AUTHOR

...view details