తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటల వ్యవహారంలో సిట్టింగ్​ జడ్జితో విచారణ జరపాలి: బండి

తెరాస ప్రభుత్వం కబ్జాల ప్రభుత్వమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఈటల భూకబ్జా వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్​ చేశారు.​ రాష్ట్రంలో కబ్జాలపై భాజపా ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉందని వ్యాఖ్యానించారు.

ఈటల వ్యవహారంపై బండి స్పందన
ఈటల వ్యవహారంపై బండి స్పందన

By

Published : May 1, 2021, 5:57 AM IST

తెరాస ప్రభుత్వం అవినీతి, కబ్జాల సర్కారని భాజపా ఆది నుంచీ చెబుతోందని.. నేడవే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులపైనా విచారణ జరిపించాలని కోరారు. కరోనా కట్టడిలో చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. శుక్రవారం రాత్రి ఆన్‌లైన్‌లో విలేకరుల సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు.

మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌, నరేందర్‌, ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వివేకానంద గౌడ్‌తో పాటు సీఎం కుటుంబంపైనా ఆరోపణలు వచ్చాయన్నారు. అందరిపైనా విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ‘‘ప్రధాని మోదీ, భాజపా ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు. రాష్ట్రంలో సీఎం, మంత్రులు అవినీతిపరులు. అవినీతి, కబ్జాల విషయంలో ముఖ్యమంత్రి తన అనుకూల మంత్రుల పట్ల ఓ రకంగా, వ్యతిరేకుల పట్ల మరో రకంగా వ్యవహరిస్తున్నారు. కరోనా పాజిటివ్‌తో విశ్రాంతి తీసుకుంటున్నారని అనుకున్నాం. కానీ వ్యతిరేకులపై స్కెచ్‌ వేస్తున్నారు’ అని ఆరోపించారు.

ఇదీ చూడండి: అంతిమ విజయం ధర్మానిదే: ఈటల రాజేందర్​

ABOUT THE AUTHOR

...view details