తెలంగాణ

telangana

ETV Bharat / state

నా సోదరులే నీరజ్​ను హత్య చేశారు..: రెండు నెలల బాబుతో సంజన ధర్నా - neeraj murder

Neeraj murder: హైదరాబాద్‌ బేగంబజార్‌లో పరువు హత్య నేపథ్యంలో బేగంబజార్‌ కూడలిలో మృతుడు నీరజ్‌ భార్య సంజన రెండు నెలల వయసున్న బాబుతో ధర్నాకు దిగారు. సంజన మాత్రం సోదరులే తన భర్తను హత్య చేశారని ఆరోపిస్తోంది. ఏడాదిగా సోదరులు నీరజ్‌ను బెదిరిస్తున్నట్లు చెబుతున్న సంజన పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు వెనక్కితగ్గలేదని ఆవేదన చెందుతున్నారు. తన భర్తను పొట్టనబెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బేగంబజార్‌ కూడలిలో రెణ్నెళ్ల బాబుతో ధర్నాకు దిగింది. అనుమానితులను గుర్తుపట్టేందుకు సంజనను పోలీసులు ఠాణాకు తీసుకెళ్లారు.

neeraj murder
నీరజ్​ హత్య కేసు

By

Published : May 21, 2022, 2:26 PM IST

నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్న బాధితులు

'నా సోదరులే నా భర్త నీరజ్​ను హత్య చేశారు. ఏడాదిగా నీరజ్​ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా వెనక్కి తగ్గలేదు. నిందితులను కఠినంగా శిక్షించాలి.'-సంజన, నీరజ్​ భార్య

ABOUT THE AUTHOR

...view details