రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జిల్లాల వారీగా 15 నుంచి 20 మంది టెన్నిస్ క్రీడాకారులను ఎంపిక చేసుకొని మొయినాబాద్‌లోని తన టెన్నిస్ అకాడమీలో అంతర్జాతీయ కోచ్‌ల ద్వారా శిక్షణ ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలిపారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన సానియా... ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నుంచి సదుపాయాలు సమకూరిస్తే, క్రీడాకారులకు టెన్నిస్ శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన సానియా మీర్జా - tennis
రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కలిశారు. ప్రభుత్వం నుంచి సదుపాయాలను సమకూరిస్తే క్రీడాకారులకు టెన్నిస్ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రికి తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన సానియా మీర్జా
తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి తగిన సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా మంత్రి సానియాను కోరారు. సానియా మీర్జా అకాడమీ, ఎల్బీ స్టేడియంలో శిక్షణకు సంబంధించిన ప్రపోజల్స్‌ను త్వరలో జరగబోయే కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ప్యాకేజింగ్ ఫిల్మ్ తయారీ ప్లాంట్ ఏర్పాటు