ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెరాస గెలుపునకు దోహదపడుతాయని సనత్ నగర్ ఆ పార్టీ అభ్యర్థి కొలను లక్ష్మీ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ రెడ్డి నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: కార్పొరేటర్ లక్ష్మీ రెడ్డి
ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు తెరాస గెలుపునకు దోహదపడతాయని సనత్ నగర్ కార్పొరేటర్, పార్టీ అభ్యర్థి కొలను లక్ష్మీ తెలిపారు. తన మీద నమ్మకంతో రెండోసారి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు తాను పార్టీకి, ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
తెరాస ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అదేవిధంగా సనత్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేస్తున్న అభివృద్ధి పథకాలు గెలుపునకు నాంది అని లక్ష్మీ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన మీద నమ్మకంతో రెండోసారి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు తాను పార్టీకి, ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజాసేవ చేయడానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:తెరాస గ్రేటర్ అభ్యర్థుల తుది జాబితా విడుదల