హైదరాబాద్ నగర శివారు వనస్థలీపురం.. నిత్యం రద్ధీగా ఉండే ప్రాతం సుష్మా థియేటర్ సెంటర్. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా దుకాణాలు కిక్కిరిసి ఉంటాయి. రకరకాల షాపులు, హోల్డింగులు కనిపిస్తుంటాయి. అందులో ఓ చిన్న హొటల్ బోర్డు అందరినీ ఆకర్షిస్తోంది. అదేదో అంతర్జాతీయ సంస్థకు చెందిన హోల్డింగ్ కాదు. ఓ చిన్న హొటల్ బోర్డు. అదే "నిరుద్యోగి@ఎంఏ, బీఈడీ". బోర్డు. ఉన్నత చదువులు చదివి సర్కారు కొలువు రాక... ఆంగ్ల మాధ్యమంలో చదవకపోవడం వల్ల ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం పోయి... లాక్డౌన్ ప్రభావంతో చేస్తున్న పని కోల్పోయి... ఉపాధి కోసం ఓ నిరుద్యోగి పెట్టుకున్న హోటలే. ఈ నిరుద్యోగి@ఎంఏ బీఈడీ.
వరంగల్ జిల్లా ములుగు మండలం పత్తిపల్లికి చెందిన లకావత్ సమ్ములాల్ నాయక్ ఎంఏ బీఈడీ వరకు చదువుకున్నాడు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశాడు. అయితే అతనిది ఆంగ్ల మాధ్యమం కాకపోవడం వల్ల అదీ పోయింది. భార్యాబిడ్డలను తీసుకుని ఉపాధికోసం నగరానికొచ్చి చిన్నా చితకా పనులు చేసుకున్నాడు. లాక్డౌన్ వల్ల అదీ పోయింది.