తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైభవంగా సహన సుందర్ నృత్య అర్రంగేటం' - SAHANA SUNDHAR

హైదరాబాద్ రవీంద్రభారతిలో చిన్నారి సహన సుందర్ భరతనాట్య అర్రంగేటం చేశారు. తన ప్రతిభతో నాట్య ప్రియులను ఆకట్టుకుంది.

అలరిపు, వర్ణం, కీర్తనం, థిల్లానా అంశాలను నయన మనోహారంగా ప్రదర్శించిన సహన

By

Published : Jun 29, 2019, 6:13 AM IST

ప్రముఖ నృత్య గురువు ఆనంద్‌ శంకర్‌ జయంతి శిష్యురాలు చిన్నారి సహన సుందర్‌ భరతనాట్య అరంగ్రేటం అంగరంగం వైభవంగా సాగింది. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సహన సుందర్‌ నృత్య ప్రదర్శన చేశారు. పుష్పాంజలితో నృత్యం ఆరంభించిన సహన...అలరిపు, వర్ణం, కీర్తనం, థిల్లానా లాంటి పలు అంశాలను నయన మనోహారంగా ప్రదర్శించింది.
తన ప్రతిభతో నాట్య ప్రియులను మంత్రముగ్థులను చేసింది. కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి జిస్టిస్‌ గోపాల్‌రావుతో పాటు పలువురు నృత్య గురువులు, నాట్య ప్రియులు సహన సుందరని అభినందించారు.

అర్రంగేటంతోనే ప్రేక్షకులను మంత్రముగ్థులను చేసిన సహన సుందర్

ABOUT THE AUTHOR

...view details