Rythu Runamafi Telangana 2023 : అప్పుల భారంతో ఉన్న రైతన్నలకు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.లక్షలోపు పంట రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రూ.41 వేల వరకు అప్పు ఉన్న వారి ఖాతాల్లో నగదు జమచేశారు. ఇప్పటి వరకు 5 లక్షల 84 వేల మందికి పైగా రైతులకు రూ.1,374 కోట్లు చెల్లింపులు చేశారు. ఇంకా దాదాపు 26 లక్షల మంది రైతులకు రూ.18,000 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. సెప్టెంబర్ నెల రెండో వారం వరకు రుణమాఫీ పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
అందుకు అనుగుణంగా అధికారులు చెల్లింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఈ నెలలో 62 వేల మందికి పైగా రైతుల ఖాతాల్లో దాదాపు రూ.238 కోట్లు జమ చేశారు. ప్రతి వారం కొంత మొత్తాన్ని జమ చేయాలని నిర్ణయించారు. ఖజానాకు డబ్బు వచ్చిన ప్రకారం చెల్లింపులు చేయనున్నారు. పన్నేతర ఆదాయం నుంచి వచ్చే మొత్తం ద్వారా రుణమాఫీపూర్తి చేయనున్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లీజునకు (ORR Lease Issue) సంబంధించి ఐఆర్బీ సంస్థ రూ.7,380 కోట్లు హెచ్ఎండీఏకు ఇటీవల చెల్లించింది.
CM KCR on Rhythu Runa Mafi : రైతన్నలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రుణమాఫీ రెండో విడత షురూ..
Loan waiver for Farmers 2023 : ఒకటి, రెండు రోజుల్లో ఆ మొత్తం ఖజానాకు జమ కానుంది. ఆ మొత్తం అందుబాటులోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చెల్లింపులు వేగవంతం చేయనున్నారు. అటు కోకాపేట నియోపొలిస్ లేఅవుట్రెండో దశ వేలం ద్వారా రూ.3,319 కోట్లు, బుద్వేల్ భూముల (Budvel land auction) ద్వారా రూ.3,625 కోట్లు సర్కార్కు సమకూరనున్నాయి. మోకిల ప్లాట్ల విక్రయం ద్వారా మరో రూ.121 కోట్లు రానున్నాయి. మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.
MLAs Wishes to CM KCR : రైతు రుణమాఫీ నిర్ణయంతో సీఎం కేసీఆర్కు అభినందనల వెల్లువ