నాగర్కర్నూల్ జిల్లాలో 3 లక్షల ఖాతాలున్నాయి. సాంకేతిక సమస్యలతో సుమారు 63 వేల మంది రైతుల వివరాలు అసలు ధరణి వెబ్సైట్లోనే నమోదుకాలేదు. మరో 64 వేల ఖాతాలకు అధికారులు సంతకాలు చేయలేదు. మిగతావి ఆధార్లో నమోదు కాక, వేలిముద్రలు సరిపోక, మరికొన్నింటికి పార్టు-బి అందక పాసు పుస్తకాల్లో మంజూరు కాలేదు. ఫలితంగా రైతుబంధు చెక్కులు అందుకోలేకపోయారు.
రైతుబంధు అందేదెలా..! - రైతులు
దేవుడు వరమిచ్చినా.. పూజారి అడ్డుపడ్డట్లుగా ఉంది.. రైతు బంధు పథకం. రైతులకు నిధులు వచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నా... నిబంధనల సాకుతో.. అధికారులు మోకాలడ్డుతున్నారు. ఫలితంగా వారి కటాక్షం కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు.
అధికారి వద్ద రైతులు
ఏదోరకంగా అన్నదాతను ఆదుకోవాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. భూరికార్డులను ప్రక్షాళన వేగవంతం చేయాల్సి ఉన్నా.. వారి అలసత్వం రైతుల పాలిట శాపంగా మారుతోంది. వీటన్నింటిపైనా ఉన్నాతాధికారులు దృష్టిసారించి తమ సమస్య తీర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.