తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడి కోసం రవాణా శాఖ కార్యాలయాల్లో సేవలు కుదింపు

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా రవాణా శాఖ కార్యాలయాల్లో మంగళవారం నుంచి సేవలు కుదించనున్నారు. స్టాట్​ పద్ధతిలో రోజుకు 32 మంది మాత్రమే సేవలు వినియోగించునుకునేలా పరిమితం చేశారు.

rto services minimised in telangana
కరోనా కట్టడి కోసం రవాణా శాఖ కార్యాలయాల్లో సేవలు కుదింపు

By

Published : May 11, 2020, 11:28 PM IST

కొవిడ్-19 కట్టడిలో భాగంగా రవాణాశాఖ కార్యాలయాల్లో మంగళవారం నుంచి సేవలు కుదించనున్నారు. ఎంవీఐ కార్యాలయాల్లో గతంలో రోజుకు 180 మందికి స్లాట్ పద్దతిలో సేవలు అందిస్తుండగా.. ఈనెల 12నుంచి వాటి సంఖ్య 32 కే పరిమితం కానుంది. ఎంవీఐ కార్యాలయాల్లో లెర్నింగ్ లైసెన్సులు 6 మందికి, డ్రైవింగ్ లైసెన్సులు 8 మందికి, మిగతా 18 మందికి ఇతర సేవలు వినియోగించుకునేలా ఉన్నతాధికారులు సేవలను పరిమితం చేశారు. స్లాట్ బుక్ చేసుకున్న 20 నిమిషాలలోపు సేవలు వినియోగించుకోపోతే స్లాట్ రద్దు కానుంది.

సేవలకోసం రీస్లాట్ బుక్ చేసుకోవాలి. గతంలో హడావిడి చేసిన బీఎస్-4 వాహనాలు ఇంకా ఉన్నా వాటి రిజిస్ట్రేషన్ రవాణా శాఖ కార్యాలయంలో జరగడం లేదు. మరోపక్క భౌతిక దూరం పాటించి మాస్కులు ఉంటేనే రవాణాశాఖ కార్యాలయాలకు రావాలని గతంలోనే అధికారులు సూచించారు. వచ్చిన ప్రతి ఒక్కరినీ శానిటైజర్​తో శుభ్రం చేసుకున్నాకే కార్యాలయాల్లోకి అనుమతిస్తున్నారు. వచ్చిన వారికి థర్మల్​ స్క్రీనింగ్​ కూడా చేస్తున్నారు.

ఇవీ చూడండి: 50 రోజుల తర్వాత సబ్​ రిజస్ట్రార్​ కార్యాలయాలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details