ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు... తాము పోరాటం కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ వన్ నాయకులు స్పష్టం చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని ఆర్టీసీ జాతీయ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో సమావేశమయ్యారు. మూడు కార్మిక సంఘాలే జేఏసీగా ఏర్పడడంలో ఆంతర్యం ఏమిటని ఆర్టీసీ జేఏసీ జేవన్ కన్వీనర్ హనుమంత్ ముదిరాజ్ ప్రశ్నించారు. సమ్మెను విచ్ఛిన్నం చేయటానికే కుట్రలు పన్నుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
'సమ్మెను నిర్వీర్యం చేయడానికే జేఏసీ'
ఆర్టీసీలో సమస్యల పరిష్కారానికి ప్రధాన కార్మిక సంఘాలన్నీ కలిసి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం మూడు సంఘాలే జేఏసీగా ఏర్పడటం భావ్యం కాదని ఆర్టీసీ జేఏసీ జేవన్ కన్వీనర్ హనుమంత్ ముదిరాజ్ పేర్కొన్నారు.
'సమ్మెను నిర్వర్యం చేయడానికే జేఏసీ'
Last Updated : Sep 22, 2019, 12:02 AM IST