ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విటర్లో (RTC MD Sajjanar tweet) పోస్ట్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆర్టీసీ బస్సులో ఓ విద్యార్థి పాఠశాలకు వెళుతూ తన హోం వర్క్‌ను పూర్తి చేసుకుంటున్న దృశ్యాలను ట్విట్ చేసి... 'మన భవిష్యత్' చక్రాలపై భద్రంగా (Future on wheels) ఉందనే వ్యాఖ్యను సజ్జనార్ జోడించారు
RTC MD Sajjanar tweet: బస్సులో ఈ విద్యార్థి చేస్తుంది చూస్తే ఆశ్చర్యపోతారు..
RTC MD Sajjanar tweet viral: ఆర్టీసీ బస్సులో ఓ విద్యార్థి పాఠశాలకు వెళుతూ తన హోం వర్క్‌ను పూర్తి చేసుకుంటున్న దృశ్యాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్లో పోస్ట్ చేశారు. మన భవిష్యత్ చక్రాలపై భద్రంగా ఉందనే వ్యాఖ్యను జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
RTC MD Sajjanar tweet viral
విద్యార్థి కమిట్ మెంట్‌ను చూస్తుంటే ముచ్చటేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థి అంకితభావానికి సెల్యూట్ అంటూ ట్వీట్(Sajjanar tweet viral on social media) చేశారు. సజ్జనార్ చేసిన ట్వీట్‌ను ఆర్థిక శాఖమంత్రి హరీశ్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రీ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:TSRTC Special Offer: రూ. వంద చెల్లించండి.. రోజంతా ప్రయాణించండి