రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంజాగుట్ట వరకు పుష్పక్ బస్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Rtc Md Sajjanar) ప్రయాణించారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న రవాణా సౌకర్యాలపై అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి చేశారు.
Rtc Md Sajjanar: పుష్పక్ బస్‌లో ప్రయాణించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ - Sajjanar traveling in Pushpak bus
మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న రవాణా సౌకర్యాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Rtc Md Sajjanar) వారిని అడిగి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
పుష్పక్ బస్
విధి నిర్వహణలో అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ అంజయ్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరమార్శించారు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌ను కలిసి మెరుగైన వైద్యం కల్పించాలని కోరారు.
ఇదీ చూడండి:Rtc Md Sajjanar: సాధారణ ప్రయాణికుడిగా మారి... సాధకబాధలు విని..