లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయం సేవకులు దేశ వ్యాప్తంగా అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవహ కాచం రమేశ్ తెలిపారు. దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా విపత్తు, ప్రమాదం సంభవించినప్పుడు బాధితులకు సహాయం అందించడానికి స్వయంసేవకులు ముందుంటారని చెప్పారు.
26 వేల స్థలాల్లో 2 లక్షల మంది స్వయం సేవకులు
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్డౌన్ మూలంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వారికి తగిన సహాయం అందించడానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్వయంసేవకులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 26 వేల స్థలాల్లో 2 లక్షల మంది స్వయంసేవకులు 25 లక్షల కుటుంబాలకు సాయం చేశారని వివరించారు.