తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తుందని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, నటుడు ఆర్‌పీ పట్నాయక్ అన్నారు. తెలంగాణలో ఎంతో మంది ప్రతిభ ఉన్న కళాకారులు ఉన్నారని...వారి గుర్తించి ఆర్థికంగా సహాయం అందిచడమే కాకుండా వేదికపై ప్రదర్శనలు ఇప్పించడం అభినందనీయమన్నారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సుస్వరవాహిని సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో స్వరాభిషేకం పేరిట నిర్వహించిన సినీ సంగీత విభావరి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగీతం రాని నాకు సంగీతం నేర్పిన గురువు సంగీత కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పీ పట్నాయక్ తో పాటు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణతో పాటు పలువురు కళాభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌పీ పట్నాయక్‌తో పాటు పలువురు కళాకారులను సుస్వరవాహిని సాంస్కృతిక సంస్థ సత్కరించింది.
'కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం' - rp
తెలంగాణ ప్రభుత్వం ఎంతో మంది కళాకారులను గుర్తించి, వారి కళలను ప్రోత్సహిస్తోందని సంగీత దర్శకులు ఆర్‌పీ పట్నాయక్ అన్నారు. కళాకారులను వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇప్పించడం అభినందనీయమన్నారు.
'కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం'
ఇవీ చూడండి: