హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. సోమవారం రాత్రి 10.45 సమయంలో వినయ్ అనే పులి మరణించిందని జూ అధికారులు తెలిపారు. 1998లో హైదరాబాద్ నెహ్రూ పార్క్లో పుట్టిన తెల్ల మగ పులి వృద్ధాప్యం కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు. వినయ్ తండ్రి మురుగన్, తల్లి కరుణ. 2018 నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ నిన్న తుది శ్వాస విడిచిందన్నారు. జూ అధికారులు గత ఐదేళ్లలో ఈ పులిని సందర్శనకు దూరంగా ఉంచారు.
వృద్ధాప్యం కారణంగా రాయల్ బెంగాల్ టైగర్ మృతి - టైగర్ మృతి చెందింది
నెహ్రూ జూ పార్క్లో వృద్ధాప్యం కారణంగా పెద్ద పులి మృతి చెందింది. గత ఏడాదిగా తీవ్ర అనారోగ్యానికి గురైన పులి సోమవారం జూలోనే మరణించిందని అధికారులు వెల్లడించారు.
అనారోగ్యంతో పెద్ద పులి మృతి