హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల బిల్లు - 2020పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కొత్త రెవెన్యూ చట్టంపై అన్ని వర్గాల ప్రజల్లో విస్తృత చర్చ జరగాలని రైతు, వ్యవసాయ కార్మికుల సంఘాలు సూచించాయి. ఈ సమావేశంలో భారత వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వెంకట్ పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ చట్టం పూర్తిగా చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతుల హక్కులు కాలరాసేలా ఉందని.. చట్టానికి పలు కీలకమైన సవరణలు చేయడం లేదా పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
'కొత్త రెవెన్యూ చట్టంతో చిన్న, సన్నకారు రైతులకు నష్టం' - etv bharath
కొత్త రెవెన్యూ చట్టం పూర్తిగా చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతుల హక్కులు కాలరాసేలా ఉందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వెంకట్ అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల బిల్లు - 2020పై రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారుల పాసు పుస్తకాల బిల్లు - 2020, భూమి హక్కుల రికార్డ్ - పాసు పుస్తకం 1971 సవరణ చట్టం, వీఆర్‌వోల రద్దు చట్టం, గ్రామ పంచాయతీలకు ధరణి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చట్టం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, దళిత బహుజన ఫ్రంట్ కన్వీనర్ శంకర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు: కాంగ్రెస్