కరోనా వైరస్ మధ్యతరగతి జీవితాలను కకావికలం చేస్తోంది. వర్తమానంలో భయాన్ని, భవిష్యత్‌పై బెంగను కలిగిస్తోంది. ఉద్యోగం ఉంటుందో లేదో అనే భయం కొందరిదైతే... మాయదారి వైరస్ ఏ వైపు నుంచి దాడి చేస్తుందో తెలియని ఆందోళన మరికొందరిని వెంటాడుతోంది. లాక్ డౌన్ సమయంలో చాలా మంది మదిని ఇలాంటి ఎన్నో ఆలోచనలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. పెరుగుతున్న అనుమానాలతో కొందరు, ఆకలి బాధతో మరికొందరు... హైదరాబాద్ నగరంలోని మానసిక సమస్యల సహాయ కేంద్రాలకు ఫోన్ చేస్తూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
మాటసాయం... ఇస్తోంది మనసుకు సాంత్వనం - రోష్ని సహాయకేంద్రం డైరెక్టర్ ఉషశ్రీతో ముఖాముఖి
మనిషికి కష్టకాలంలో మాట సాయం చెప్పలేనంత అండను ఇస్తుంది. అందుకే అంటారు ఎన్ని గొడవలున్నా కష్టం వచ్చినప్పుడు ఓ మాట మాట్లాడితే అప్పటి వరకు ఉన్న అంతర్యాలన్నీ తొలగిపోతాయని... నోటు ఇచ్చే భరోసా కంటే మాటతో వచ్చే భరోసా బంధాన్ని పటిష్ఠం చేస్తుంది. కరోనా కష్టకాలంతో రకరకాల సమస్యలతో మానసికంగా, శారిరకంగా కుంగిపోతున్న వారికి రోష్ని సహాయ కేంద్రం మాటతో భరోసా కల్పిస్తోంది. మేముండగా మీకేల ఈ భేల అంటూ ధైర్యన్ని నింపుతున్నారు రోష్ని సహాయ కేంద్ర ప్రతినిధులు.
మాటసాయం... ఇస్తోంది మనసుకు సాంత్వనం
అలాంటి సహాయ కేంద్రాల్లో ప్రధానమైన రోష్ని సహాయ కేంద్రానికి గడిచిన ఏడు వారాల్లో 1,600 మంది ఫోన్ చేసి తమ ఆవేదన చెప్పుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్ల నుంచి రోష్ని సహాయ కేంద్ర ప్రతినిధులు అవతలి వ్యక్తికి మాట సహాయం చేసి సాంత్వన కలిగిస్తున్నారు. అయితే తమ సంస్థకు వస్తున్న ఫోన్‌కాల్స్‌లో దాదాపు 45 శాతం కరోనా వైరస్ కాల్సే ఉంటున్నాయని రోష్ని డైరెక్టర్ ఉషశ్రీ ఈటీవీ భారత్‌కు వివరించారు.
ఇదీ చూడండి :ముద్దు పెట్టినందుకు వెంటాడుతున్న కరోనా..!
Last Updated : May 18, 2020, 6:31 PM IST