హైదరాబాద్ పాతబస్తీలోని ఓ పురాతన ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని హుండీ తాళాలను పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ పూజారి దేవాలయం తెరచి చూడగా... హుండీ తాళాలు పగలగొట్టి ఉండడంతో ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించాడు. రేపు హుండీ లెక్కింపు ఉండగా... దొంగతనం జరగడం చర్చనీయాంశంగా మారింది. సుమారు 35వేల నగదు అపహరించుకుపోయినట్లు... పూజారి తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పాతబస్తీలోని పురాతన ఆలయంలో చోరీ
హుండీ తాళాలను పగలగొట్టి సుమారు రూ.35వేల నగదును దుండగులు దోచుకొళ్లిన ఘటన పాతబస్తీలోని పురాతన ఆలయంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పాతబస్తీలోని పురాతన ఆలయంలో చోరీ