ఇంటి తాళం బద్దలుకొట్టి 40 తులాల బంగారం చోరీ - secendrabad
తాళంవేసి ఉన్న ఇంట్లో దొంగలు చొరబడి 40 తులాల బంగారం, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. సికింద్రాబాద్‌లోని నెహ్రూ నగర్లో జరిగిన ఈఘటన స్థానికంగా కలకలం రేపింది.
సికింద్రాబాద్ మారేడ్‌పల్లి ఠాణా పరిధిలో భారీ దొంగతనం జరిగింది. తాళంవేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు చొరబడి 40తులాల బంగారు నగలు, రూ.15 వేల నగదు దోచుకెళ్లారు. స్థానిక నెహ్రూనగర్‌లో నివాసముంటున్న బాధిత కుటుంబీకులు ఇంటికి తాళం వేసి బుధవారం రాత్రి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. తిరుగొచ్చేసరికి చాలా ఆలస్యం అవ్వడం వల్ల అందరూ కింద అంతస్తులోనే పడుకున్నారు. తెల్లారి లేచి పైకి వెళ్లి చూసేసరికి తాళం బద్దలుకొట్టి లోపల వస్తువులు చిందరవందరగా ఉండడం చూసి ఖంగుతిన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు క్లూస్‌టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.