Road Accidents in Telangana Today :తెలంగాణలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రహదారులు రక్తమోడాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం మత్తు కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి.
Road Accident in KPHB Colony :హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ఫోరంమాల్ సర్కిల్ వద్ద, ఓ కారు రాంగ్ రూట్‌లో వచ్చి బీభత్సం సృష్టించింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. మద్యం మత్తులో వాహనాన్ని నడిపిన వ్యక్తి అతి వేగంతో దూసుకొచ్చి, ఓ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
Bus Accident In Muktsar : కాలువలో పడిన బస్సు.. 8 మంది మృతి.. అనేక మందికి గాయాలు
CAR Accident in KPHB Colony :ప్రమాదానికి కారణమైన వ్యక్తి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడి కుమారుడు అల్లోల అగ్రజ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో పార్టీ చేసుకున్న అగ్రజ్‌రెడ్డి, అతని స్నేహితులు మద్యం మత్తులో అతి వేగంగా వచ్చి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిపారు. అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించి, మద్యం తీసుకున్నట్లు నిర్ధారించామని చెప్పారు. బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Road Accident in Balanagar :బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఐడీపీఎల్ వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం (Road Accidents in Telangana) చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అతివేగంగా వెళ్లి, డీసీఎం వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో బైక్ నడుపుతున్న అఖిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, వెనక కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్ట నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ప్రమాదానికి కారణం అతివేగమేనని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.