తెలంగాణ

telangana

ETV Bharat / state

గతేడాది 364 మంది పాదచారుల దుర్మరణం - Road accident details in Telangana

కాసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. నగరంలో మాత్రం పాదచారులకు ప్రమాదకరంగా మారింది. గతేడాది హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలో 364 మంది పాదచారులు మృత్యువాత పడ్డారు.

గతేడాది 364 మంది పాదచారుల దుర్మరణం
గతేడాది 364 మంది పాదచారుల దుర్మరణం

By

Published : Feb 5, 2021, 7:25 AM IST

వాహనాల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్‌ నగరంలో రోడ్ల విస్తీర్ణం పెరగడం లేదు. పాదబాటలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో పరిస్థితి దారుణం. ఒకవైపు నుంచి మరోవైపు దాటాలంటేనే జంకాల్సిన పరిస్థితి. నిర్లక్ష్య డ్రైవింగ్‌తో వాహనదారులు అదుపు తప్పి పాదచారుల మీదికి దూసుకెళ్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మరణిస్తున్న వారిలో ద్విచక్రవాహనదారుల తర్వాతి స్థానం పాదచారులదే.

అత్యధికంగా సైబరాబాద్‌లో...

2019తో పోల్చితే గతయేడాది మరణాల సంఖ్య తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొంత కాలం వాహనాలు రోడ్డెక్కకపోవడం దీనికి కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. సైబరాబాద్‌లో ఎప్పటిలానే 2020లోనూ అత్యధికంగా పాదచారులు(176 మంది) మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత రాచకొండ పరిధిలో 120 మంది, హైదరాబాద్‌లో 68 మంది దుర్మరణం చెందడం గమనార్హం.

వేగం 40 కి.మీలు దాటితే...

వాహనాల వేగం గంటకు 40 కి.మీల కంటే ఎక్కువగా ఉంటే ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. హైదరాబాద్‌లోని అధిక శాతం ప్రాంతాల్లో వాహనాల సగటు వేగం 40 కి.మీలకు మించదు. ప్రమాదాలు ఎక్కువగానే ఉన్నా భారీస్థాయిలో ప్రాణనష్టం ఉండటం లేదని స్పష్టం చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో పాదచారుల వంతెనలను యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తేవాలని సూచిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, దిల్లీ మాదిరిగా పాదచారులకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేయాలని పేర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details