రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు పెరిగాయి. గతేడాది జూన్‌తో పోలిస్తే నల్గొండ జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ పాతాళగంగ పైకి వచ్చింది. మే నెలతో పోలిస్తే రాష్ట్రంలో భూగర్భజలాలు సగటున 0.53 మీటర్ల మేర పెరుగుదల నమోదైంది. నిజామాబాద్, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి మినహా మిగతా జిల్లాల్లో మే నెలతో పొలిస్తే భూగర్భ జలాలు పెరిగాయి.
రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన భూగర్భ జలమట్టం
గతేడాది జూన్‌తో పోలిస్తే నల్గొండ మినహా అన్ని జిల్లాల్లోనూ భూగర్భ జలమట్టం పెరిగింది. మే నెలలో పోలిస్తే రాష్ట్రంలో భూగర్భజలాలు సగటున 0.53 మీటర్ల మేర పెరుగుదల నమోదైంది.
రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన భూగర్భ జలమట్టం
రాష్ట్రంలో ప్రస్తుతం సగటున 10.75 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో అత్యంత లోతులో 22.24 మీటర్ల సగటు ఉండగా ...వనపర్తి జిల్లాలో సగటున కేవలం 5.34 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు ఉన్నాయి. పదేళ్ల సగటుతో పోలిస్తే రాష్ట్రంలోని 589 మండలాలకు గాను 449 మండలాల్లో భూగర్భజలాలు పెరిగాయి. 140 మండలాల్లో మాత్రం తగ్గుదల ఉంది. ఈ మేరకు రాష్ట్ర భూగర్భజలశాఖ వివరాలు వెల్లడించింది.
ఇది చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ