ఏపీలోని విశాఖలో మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం రాజుకుంది. భీమిలి వద్ద సముద్రంలో రింగువలలతో వేటాడుతున్న పడవలను జాలరిపేట మత్య్సకారులు చుట్టుముట్టారు. దాదాపు 50 బోట్లపై వెళ్లిన భీమిలికి చెందిన మత్స్యకారులు అడ్డుకున్నారు.
విశాఖలో మళ్లీ తెరపైకి వచ్చిన రింగువలల వివాదం - విశాఖ జిల్లా వార్తలు
ఏపీలోని విశాఖలో మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం మళ్లీ తలెత్తింది. భీమిలి వద్ద సముద్రంలో రింగువలలతో వేట చేస్తున్న పడవలను జాలరిపేట జాలర్లు చుట్టుముట్టారు. దాదాపు 50 బోట్లపై వెళ్లిన భీమిలికి చెందిన మత్స్యకారులు అడ్డుకున్నారు.
రింగువలలు, బల్లవలల మత్స్యకారుల మధ్య కొద్దిరోజులుగా వివాదం జరుగుతోంది. రింగువలలతో వేట కారణంగా చిన్న చేపలు సైతం ఆ వలలో చిక్కుకుని...తమకు తక్కువ చేపలు పడుతున్నాయని సంప్రదాయ వల మత్స్యకారులు మండిపడుతున్నారు. రింగు వలలు నిషేధించాలంటూ కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం 8 కిలోమీటర్ల దాటిన తరువాతే రింగువలలతో వేట కొనసాగించాలని ఆదేశించడంతో....భీమిలి, ఉప్పాడ తీరం నుంచి మత్స్యకారులు వెళ్లగా....పెదజాలారి పేటకు చెందిన మత్స్యకారులు అడ్డుకున్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య సముద్రంలో ఉద్రిక్తత నెలకొంది.
ఇదీ చదవండి:కారులో చెలరేగిన మంటలు... తప్పిన ప్రాణనష్టం