అడవులపై హక్కులు ఆదివాసీలకే ఉంటాయని రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ సూచిస్తోందని రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నెగంటి రవి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆదివాసీలకు మద్దతుగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ కుమురం భీం విగ్రహం వద్ద రైతు స్వరాజ్య వేదిక, ఆదివాసీ, రైతు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆదివాసీ హక్కులను హరించే విధంగా ఉన్న సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలన్నారు. అటవీ భూములపై ఆదివాసీ మహిళల హక్కులు పరిరక్షించాలి, అటవీ భూముల చుట్టూ కందకాలు తవ్వడాన్ని ఆపేయాలంటూ ధర్నా చేపట్టారు.
అడవులపై హక్కులు ఆదివాసీలకే : కన్నెగంటి రవి - SUPREME COURT
హరితహారం పేరిట పోడు భూముల్లో మొక్కలు నాటడం ఆపేయాలంటూ హైదరాబాద్ ట్యాంక్‌బండ్ కుమురం భీం విగ్రహం వద్ద రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ చేసింది. మా ఊళ్లో.. మా రాజ్యం అంటూ పలు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
అడవులపై హక్కులు ఆదివాసీలకే ఉన్నాయి : కన్నెగంటి రవి
ఆదివాసీల కోసమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1/70 చట్టం, పీసా చట్టం లాంటివి అమల్లోకి వచ్చాయని కన్వీనర్ గుర్తు చేశారు. ఆదివాసీ, గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం కోసం 2006 అటవీ హక్కుల చట్టం చేపట్టినా ఆశించిన ఫలితం రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు, రచయితలు, కవులు, కళాకారులు, పాత్రికేయులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : డబ్బులు ఊరికే రావు కానీ చదువు ఉచితంగా వస్తుంది