హైదరాబాద్ ఎర్రగడ్డ డివిజన్లో పేదలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కరోనా కట్టడిలో భాగంగా పేద ప్రజలు ఆకలి బాధలు పడకుండా ఉండేందుకు తన సొంత నిధులు వెచ్చించి బియ్యం పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఎర్రగడ్డలో కిరాణా సామగ్రి పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాగంటి - ఎర్రగడ్డలో కిరాణా సామగ్రి పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాగంటి
లాక్ డౌన్ కారణంతో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకుంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని స్థానిక ఎర్రగడ్డ డివిజన్లో సుమారు వెయ్యి నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
పేదలకు బియ్యం పంపిణీ చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
వైరస్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. కరోనా వ్యాధి నిరోధించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. సరుకుల పంపిణీ సమయంలో భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రతి డివిజన్లో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు షరీఫ్, తన్ను సురేష్ తదితరులు పాల్గొన్నారు.