భూ పరిపాలన వ్యవస్థ ప్రక్షాళన అవసరమని అఖిల పక్ష సదస్సు అభిప్రాయపడింది. ఈ వ్యవస్థ మెరుగుపడాలన్నా.. సామాజిక న్యాయం జరగాలన్నా.. ఏకీకృత చట్టం ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని వివిధ పార్టీల నేతలు పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రైతాంగానికి భూమి హక్కు సమస్యలు పరిష్కారాలుఅనే అంశంపై అఖిల పక్ష సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం సమగ్రమైన కొత్త చట్టాన్ని తీసుకురావాలని అఖిల పక్ష నేతలు కోరారు.
భూపరిపాలన వ్యవస్థ ప్రక్షాళన అవసరం - Revenue
తెలంగాణ రైతాంగానికి భూమి హక్కు సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై అఖిల పక్ష సదస్సు జరిగింది. సత్వరమే రాష్ట్రంలో భూపరిపాలన వ్యవస్థ అవసరమని మేధావులు అభిప్రాయపడ్డారు.
1971 చట్టంలో సవరణలు చేసి కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం రైతులకు చెప్పిందని... సంవత్సరం గడిచినా 32 శాతం మంది రైతులకు ఇంకా పాస్ పుస్తకాలు అందలేదని వారు తెలిపారు. వీరిలో ఎక్కువగా సన్నకారు రైతులు, పేద, బలహీనవర్గాల వారే ఉన్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కాకుండా, భూముల సర్వే కూడా కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని నేతలు పేర్కొన్నారు. అన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రైతులతో పాటు అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.
ఇవీ చూడండి: నిరుపేదల ఆకలి తీర్చే 'రోటీ బ్యాంక్'