RevanthReddy Fires on KCR :కేసీఆర్, కేటీఆర్‌కు ప్రజల ప్రాణాలంటే పూచిక పుల్లతో సమానమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం వరదలతో అతలాకుతలం అయిందని చెప్పారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
RevanthReddy Comments on KTR :కేసీఆర్ వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా రాజకీయాలపై దృష్టి పెట్టారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలు వరదలతోఅల్లాడుతుంటే కేటీఆర్ పార్టీల్లో మునిగిపోయారని విమర్శించారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. 30 మంది చనిపోయినా ముఖ్యమంత్రి పరామర్శించలేదని అన్నారు. వరద బాధితులను సీఎం ఎందుకు పరామర్శించడానికి వెళ్లలేదని ప్రశ్నించారు. కేంద్రం తాత్కాలికవరద సాయం కింద రాష్ట్రానికి రూ.1,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డిపై ఉందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
RevanthReddy on Telangana Floods :వరదల్లో నష్టపోయిన వారికి.. ప్రభుత్వం తాత్కాలిక పరిహారంగా రూ.15,000 ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని అన్నారు. ఇసుక మేటలతో నిండిన వ్యవసాయ భూములకు రూ.20,000 ఇవ్వాలని పేర్కొన్నారు. తెలంగాణలో 10లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. వరద సహాయక చర్యల్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గానికి.. వందలమంది కార్యకర్తలతో రేవంత్‌రెడ్డి పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలోనే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆయన పరిశీలించారు. సోమవారం లోపు ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలన్నారు. లేకపోతే పార్లమెంటులో సోమవారం నితిన్ గడ్కరీకి నివేదిస్తామని చెప్పారు. అక్కడినుంచి మల్కాజ్‌గిరికి చేరుకున్న రేవంత్‌రెడ్డి.. అక్కడి కాలనీల్లో పర్యటించారు.