Revanth Reddy Zoom Meeting With DCC Presidents :తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో.. ఈ నెల 11 నుంచి సమావేశాలు నిర్వహించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు డీసీసీ అధ్యక్షులతో.. రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్‌లు జూమ్ ( Revanth Reddy Zoom Meeting With DCC Presidents) ద్వారా సమావేశం నిర్వహించారు.
Tukkuguda Vijaya Bheri Sabha :ఈ నెల 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి బహిరంగ సభపై (Tukkuguda Vijaya Bheri Sabha) వారు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 35,000 బూత్‌ల నుంచి సభకు తరలివచ్చేలా చూడాలనిరేవంత్‌రెడ్డి.. డీసీసీలకు సూచించారు. రేపు 17 పార్లమెంట్ అబ్జర్వర్లు, వైస్‌ప్రెసిడెంట్లతో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 12, 13, 14 మూడు రోజులు పార్లమెంట్ పరిధిలో వారు.. అన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు చేస్తారని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Congress Party joinings in Telangana : కాంగ్రెస్‌లో ప్రముఖ నాయకుల చేరికకు ముహూర్తం ఖరారు
Congress to Announced Five Guarantees in Telangana : ఈ నెల 17న విజయభేరీ సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీలను విడుదల చేస్తారని రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ నెల 18న ఉదయం 11:00 గంటలకు 119 నియోజకవర్గాలకు జాతీయ నాయకులు చేరుకుంటారని.. అక్కడ డీసీసీలతో కలిసి 5 గ్యారంటీలకు సంబంధించి పోస్టర్లు అతికించాలని సూచించారు. ఇంటింటికి గ్యారంటీ కార్డులను అందేట్లు చూడాలని.. కార్యకర్తలతో కలిసి భోజనాలు చేయాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆ తర్వాత మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సోనియాగాంధీ ప్రకటించిన అయిదు గ్యారంటీలను ప్రజలకు వివరించాలని రేవంత్‌రెడ్డి సూచించారు. 18న ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు సమన్వయం చేసుకుని సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.